బొప్పాయి హల్వా కావలసిన పదార్థాలు
బొప్పాయి గుజ్జు - 2 కప్పులు,
పంచదార - 1 కప్పు
గ్లూకోజ్ - 50 గ్రాములు,
మిల్క్‌పౌడర్ - 1 టీ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
బొప్పాయి హల్వా తయారుచేసే విధానం
బొప్పాయి గుజ్జును సగమయ్యే వరకు సన్నసెగమీద ఉడికించాలి. అడుగంటకుండా తిప్పుతుండాలి. అందులోనే గ్లూకోజ్, పంచదార, నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిపడేవరకు కలుపుతుండాలి. కొద్దిగా నీళ్లలో మిల్క్‌పౌడర్ వేసి చిక్కగా చేసి పై మిశ్రమానికి కలపాలి. ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమం మొత్తం సమానంగా ఉండేట్లు వెయ్యాలి. బాగా ఆరిన తర్వాత కావలసిన ఆకారాల్లో ముక్కలు కోసుకోవచ్చు. ఈ ముక్కలు వారం రోజులు నిల్వ ఉంటాయి. బొప్పాయి హల్వా ఆరోగ్యమే కాదు, చాలారుచిగా ఉంటుంది కూడా.

No comments:
Post a Comment