Tuesday, August 26, 2014

ఓట్స్‌ కొబ్బరి హల్వా


ఓట్స్‌ కొబ్బరి హల్వా కావలసిన వస్తువులు: 

ఓట్స్‌ - 250 గ్రాములు,
పచ్చికొబ్బరి కోరు - 100 గ్రాములు,
చక్కెర - 1 ెవద్దకవ్పు,
నెయ్యి-50గ్రాములు,
జీడిపప్పు,ద్రాక్ష - 25గ్రాములు,
సాఫ్రాన్‌ కలర్‌ - చిటికడు,
పాలు - 1 చెంచా.

ఓట్స్‌ కొబ్బరి హల్వా తయారు చేసే విధానం:

ఓట్స్‌ కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి, పచ్చికొబ్బరి కోరు రెడీగా పెట్టుకొని స్టవ్‌ వెలిగించి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడి - ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. చక్కెర వేసి కొద్దిగా నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి కోరు, ఓట్స్‌ పొడి వేసి తివ్పుత పాలల్లో కలివిన సాఫ్రాన్‌ వేసి తివ్పి నెయ్యి వేయాలి. ఒక్క ఐదునిమిషాల తర్వాత నెయ్యి తేలుతుంది. వేయించిన జీడి - ద్రాక్ష వేసి దించుకుంటే ఓట్స్‌- కొబ్బరి హల్వా రెడీ.

No comments:

Post a Comment