Tuesday, August 26, 2014

బాదం పాయసం



బాదం పాయసం కావలసిన పదార్థాలు :
నెయ్యి... నాలుగు టీ.
బాదం పప్పు.. 250 గ్రా.
పంచదార... 250 గ్రా.
పాలు... అర లీ.
యాలక్కాయలు, జీడిపప్పు, సారా పప్పు, పిస్తాపప్పు... తలా పది గ్రా.
కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ.

బాదం పాయసం తయారీ విధానం :
బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని మరియూ పాలు చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి. తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సారా, పిస్తా పప్పులను కలుపుకోవాలి.కలర్‌కోసం కేసరి పౌడర్, యాలక్కాయల పొడిని కూడా చేర్చుకోవాలి. అంతే వేడివేడి బాదం పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడిగానైనా తినవచ్చు లేదా చల్లగా తినాలకునేవారు ఇరవై నిముషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తినవచ్చు.

No comments:

Post a Comment