Tuesday, August 26, 2014

మలై కాజా



మలై కాజా కావలసిన పదార్థాలు

పాల మీగడ - 100 గ్రాములు
పనీర్‌ తురుము - అరకేజీ
జామూన్‌ మిక్స్‌ - 200 గ్రాములు
పంచదార - 1 కేజీ
నీళ్లు - తగినన్ని
నూనె - వేయించడానికి సరిపడా
మైదా - 100 గ్రాములు
యాలకుల పొడి - అర స్పూను

మలై కాజా తయారు చేసే విధానం


పనీర్‌ తురుములో మైదా, పాలమీగడ, జామూన్‌ మిక్స్‌, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టుకోవాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలా వత్తుకోవాలి. సన్నగా పొడవు ముక్కలు కోసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. వీటిపై ఒకసారి అప్పడాల కర్రతో కొద్దిగా వత్తి కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వెంటనే పంచదార పాకంలో వేసి మూడు నిమిషాలు వుంచి తియ్యాలి. తర్వాత పంచదార పొడిలో దొర్లించి తియ్యాలి. పంచదార పాకం ఎంత బాగా పడితే కాజాలు అంత రుచిగా ఉంటాయి. వారం రోజులు నిల్వ వుంటాయి కూడా.

No comments:

Post a Comment