Tuesday, August 26, 2014

పెసర లడ్డూలు



పెసర లడ్డూలు కావలసిన పదార్థాలు

ఛాయపెసరపప్పు - 1 కేజీ
పంచదార - 1 కేజీ
నెయ్యి - 400 గ్రాములు
జీడిపప్పు - 50 గ్రాములు
యాలకులు - 6,
నీళ్లు - తగినన్ని
పచ్చకర్పూరం - చిటికెడు

పెసర లడ్డూలు తయారు చేసే విధానం
పెసరపప్పు వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పంచదారలో సరిపడా నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి. అందులో పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత పెసరపొడి, కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలిపి దించాలి.అందులోనే నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కలపాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి ఒక రోజు తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment