Tuesday, August 26, 2014

మీల్ మేకర్ పాయసం SOYA PAYASHAM


మీల్ మేకర్ పాయసం కావలసినవి: 
Soya Payasham

మీల్‌మేకర్ - 50గ్రా.,
పాలు - అరలీటరు,
పంచదార - 50గ్రా.,
జీడిపప్పు -10గ్రా.,
కిస్‌మిస్- 10గ్రా.,

బాదాం పప్పు - 5,
కుంకమ పువ్వు - కొద్దిగా (కలర్ కోసం),
నెయ్యి - టీ స్పూన్,
పచ్చ ఏలకులు - 2,
పిస్తాపప్పు - టీ స్పూన్.

మీల్ మేకర్ పాయసం తయారి: 
Soya Payasham 

- మీల్‌మేకర్‌ను వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలి.
- మందంపాటి గిన్నెలో పాలను మరిగించాలి.
- మీల్‌మేకర్‌ని నీళ్ల నుంచి బయటకు తీసి, గట్టిగా పిండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- బాగా కాగిన పాలలో పంచదార, కుంకమ పువ్వు, ఏలకులు, కిస్‌మిస్, జీడిపప్పు వేసి, కలిపి మరికాసేపు మరిగించాలి.
- చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మీల్‌మేకర్‌ని పాలలో వేసి కలపాలి.
- మిశ్రమం చిక్కబడేంత వరకు ఉంచి, తరువాత వేరే గిన్నెలోకి పోయాలి. గార్నిష్ కోసం పిస్తా, బాదం పప్పు పలుకులు పైన వేయాలి.

No comments:

Post a Comment