Tuesday, August 26, 2014

కాజు బొప్పాయి ముర్జీ

కాజు బొప్పాయి ముర్జీ కావలసిన పదార్థాలు
బొబ్బాయి పండు - చిన్నది 1, 
పంచదార - 2 కప్పులు, 
నెయ్యి - 1 కప్పు, 
యాలకుల పొడి - అరస్పూను,
జీడిపప్పు పలుకులు - 3 స్పూన్లు
బాదం పలుకులు - 3 స్పూన్లు, 
మైదా - అరకప్పు, 
చిక్కటి పాలు - 1 కప్పు,
కిస్‌మిస్‌ - 10,
పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు


కాజు బొప్పాయి ముర్జీ తయారు చేసే విధానం

బొప్పాయి ముక్కలను పేస్ట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూను నేతిలో మైదాపిండి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పంచదారలో ఒక కప్పు నీళ్లు పోసి తీగపాకం పట్టి, పాలు పోసి ఉడికించాలి. రెండు నిముషాల్లో పాలు విరిగిపోతాయి. ఆ మిశ్రమంలో వేయించిన మైదా, బొప్పాయి పేస్ట్‌, పచ్చ కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, కిస్‌మిస్‌, నెయ్యి వేసి కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పొయ్యాలి. అంతే కాజు బొప్పాయి ముర్జీ రెడీ. కావాలనుకుంటే దీన్ని ముక్కలు కోసుకోవచ్చు. 

No comments:

Post a Comment