Tuesday, August 26, 2014

రవ్వ, కొబ్బరి భక్షాలు



రవ్వ, కొబ్బరి భక్షాలు కావలసిన పదార్థాలు

బొంబాయి రవ్వ - 1 కప్పు
పచ్చి కొబ్బరి కోరు - 1 కప్పు
చక్కెర - 1 కప్పు,
నెయ్యి - 2 స్పూన్లు
యాలకుల పొడి - 1 స్పూను
గోధుమపిండి - పావుకిలో
నూనె - 1 కప్పు

రవ్వ, కొబ్బరి భక్షాలు తయారు చేసే విధానం

బొంబాయి రవ్వ, కొబ్బరి కోరు పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. నీళ్లు మరిగించి చక్కెర వేయాలి. చక్కెర
కరిగిన తరువాత కొద్దికొద్దిగా రవ్వ వేస్తూ ఉండకట్టకుండా కలపాలి. మూత పెట్టి తక్కువ మంటమీద ఉడకనివ్వాలి. నీళ్లు ఇంకిపోయి మిశ్రమం దగ్గరపడ్డాక నెయ్యి, యాలకుల పొడి, కొబ్బరి కోరు కలిపి మూత పెట్టేయాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేసు కోవాలి. మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకోవలి. గోధుమపిండిని నీళ్లతో కలుపుకుని కొద్దిగ వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిలో ఉడికించినబొంబాయి రవ్వ, కొబ్బరి మిశ్రమం ఉండలు పెట్టి వత్తుకోవాలి. పెనంమీద నెయ్యితో కాల్చుకుంటే చాలా బావుంటాయి.

No comments:

Post a Comment