Tuesday, August 26, 2014

కొబ్బరి పాయసం


కొబ్బరి పాయసం కావలసిన పదార్థాలు

బియ్యం - పావు కిలో,
 పాలు - అరలీటరు, 
కొబ్బరి కాయలు - 2, 
బెల్లం - అర కిలో, 
పచ్చ కర్పూరం - చిటికెడు, 
యాలకుల పొడి - 1 స్పూన్‌
బాదంపప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పు - కొద్దిగా

కొబ్బరి పాయసం తయారు చేసే విధానం

పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చెయ్యాలి. పిప్పి వడగట్టి కొబ్బరి పాలు తియ్యాలి. ఇలా రెండుమూడు సార్లు చేసి కొబ్బరి పాలు తీసుకోవాలి. కాగిన ఎసట్లో కడిగిన బియ్యం పోసి ఒక పొంగు రానివ్వాలి. అందులో కాగబెట్టి చల్లార్చిన పాలు, కొబ్బరి పాలు పోసి సన్న సెగ మీద ఉడికించాలి. కొంచెం సేపు తర్వాత బెల్లం వేసి మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన బాదం పప్పులు, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, పచ్చ కర్పూరం వేసి కలిపి మూత పెట్టాలి. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ.

No comments:

Post a Comment