Tuesday, August 26, 2014

భేల్ పూరి



మరమరాలు 2 cups
టొమాటోలు 1/2 cup
ఉల్లిపాయ 1
బంగాళదుంపలు 2
సన్న కారప్పూస 100 gm
చింతపండు చట్నీ 3 tbsp
పుదీనా చట్నీ 2 tsp
నిమ్మరసం 2 tsp
కొత్తిమిర 1/4 cup
కారంపొడి 1 tsp
ఉప్పు తగినంత

ముందుగా ఉల్లిపాయ, టొమాటోలు సన్నగా కోసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి 
పొడి చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో మరమరాలు,తరిగిన ఉల్లిపాయలు,టొమాటోలు,
కొత్తిమిర,చట్నీలు,బంగాళదుంప పొడి నిమ్మరసం,కారం,తగినంత ఉప్పు వేసి బాగా 
కలియబెట్టాలి. చివరగా కారప్పూస,కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి. 


చింతపండు(స్వీట్ ) చట్నీ

చింతపండు పులుసు 1 కప్పు
ఖర్జూరం 4
బెల్లం నిమ్మకాయంత
జీలకర్ర పొడి 1 tsp

అన్నీ కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. 


పుదీనా( గ్రీన్) చట్నీ

పుదీనా 1 కప్పు
కొత్తిమిర 1 కప్పు
పచ్చిమిర్చి 2
ఉప్పు తగినంత

అన్నీకలిపి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా కొబ్బరిపొడి,క్రీం కలిపి రుబ్బుకుంటే సాండ్‍విచ్ కి రాసుకోవచ్చు.

No comments:

Post a Comment